పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టడమా లేక వేరో పార్టీలో చేరడమా అనే అంశం పై పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం మాజీ నేతలతో పాటు కొంత మంది సన్నిహితులతో వచ్చే రెండు మూడు రోజుల్లో సమావేశమై వాళ్ల అభిప్రాయాన్ని తీసుకోబోతున్నారు. ఈ విషయాల పై చర్చించిన తరువాత మార్చి 11 న రాజకీయ ప్రవేశ రంగ నిర్ణయం ప్రకటించనున్నారు. ఒకవేళ కొత్త పార్టీ పెడితే పవన్ రిపబ్లికన్ పార్టీ లేదా యువరాజ్యం పేర్లు పరిశీలనకి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.