A PHP Error was encountered
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/telugut1/public_html/system/core/Exceptions.php:185)
Filename: libraries/Session.php
Line Number: 675
A PHP Error was encountered
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/telugut1/public_html/system/core/Exceptions.php:185)
Filename: libraries/Session.php
Line Number: 675
A PHP Error was encountered
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/telugut1/public_html/system/core/Exceptions.php:185)
Filename: libraries/Session.php
Line Number: 675
|
|
మొబైల్ నుంచా, ల్యాండ్ లైన్ నుంచా...
ప్రేయసి: డియర్, నా బర్త్ డేకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? ప్రియుడు: నా హృదయం నీదే ప్రియా, తీసుకో. ప్రేయసి: నీ హృదయం ఎవరికి కావాలి, రింగు ఇవ్వలేవా? ప్రియుడు: అంతేనా, ఇంతకీ మొబైల్ నుంచి ఇవ్వమంటావా, ల్యాండ్ లైన్ నుంచి ఇవ్వమంటావా..?
సామెత లాంటి సామెత
టీచర్: నారు పోసినోడే నీరు పోస్తాడు లాంటి సామెత ఒక్కటి చెప్పరా, రామూ..? రాము: పాఠం చెప్పినవాళ్లే పరీక్ష రాయాలి టీచర్....
అరవై క్యాండిళ్లు పెట్టలేక, ఇలా..
అప్పారావు తన 60వ జన్మదినం జరుపుకుంటున్నాడు మిత్రుడు అప్పారావును ఇలా అడిగాడు.. "కేక్ మీద బల్బు పెట్టావేంటిరా...?" "అరవై క్యాండిళ్లు పెట్టడం కష్టం. అందుకనే అరవై వాట్ల బల్బు పెట్టానాని.." చెప్పాడు అప్పారావు తన తెలివికి తానే మురిసిపోతూ...
21 అంగుళాల టీవీయే
రాములమ్మ: ఈ రోజు రాత్రి ఏడు గంటలకు డిస్కవరీ చానెల్‌లో 30 అడుగుల పామును చూపిస్తారట. తప్పకుండా చూడు వదినా... శాంతమ్మ: నాకు అంత అదృష్టం లేదులే, వదినా... రాములమ్మ: ఎందుకు... శాంతమ్మ: ముదనష్టపు మొగుడు, ధర ఎక్కువని 21 అంగుళాల టీవీయే కొన్నాడు, వదినా...
పిల్లి పాలు
భర్త: బంగారంలాంటి పాలు పిల్లి పాలు చేశావేమిటే.... భార్య (వెటకారంగా): గేదె పాలు అయితే పిల్లి పాలు అంటారేమిటీ, ఏమైనా తల బాగా లేదా...
బంగారు పళ్లు బయటపడతాయని...
భార్య: ఆ దొంగ వెధవ ఇంట్లో బంగారం, నగలు, డబ్బులు ఎత్తుకు పోతుంటే కామ్‌గా ఎలా ఉన్నారండీ.. నోరు తెరిచి కాస్తా అరిస్తే ఇరుగు పొరుగువాళ్లు వచ్చేవారు కదా.. మీ నోటి నుంచి ముత్యాలు రాలి పోయేవా.. భర్త: నోరు తెరిచి అరెస్తే బంగారం పళ్లు బయటపడి, వాటిని కూడా లాక్కుపోతాడని భయపడ్డా..
Number Please
భర్త కోసం ఆఫీసుకు ఫోన్ చేసింది ధనలక్ష్మి. "కొంచెం మా ఆయన్ను పిలుస్తారా?" అడిగింది ఆపరేటర్ని.
"number please" అడిగింది ఆపరేటర్.
"నెంబరేమిటి నీ బొంద. నాకేమైనా పదిమంది మొగుళ్ళనుకున్నావా?" కయ్మంది ధనలక్ష్మి.
Blood Circulation
"చూడండి మిస్.. చాలా లేటెస్ట్ టైట్స్. జపాన్ నుంచి తెప్పించాం. ఇవి వేసుకున్నారంటే blood circulation దెబ్బకు పెరుగుతుంది" డ్రెస్సులు చూపిస్తూ షాపతను కవితతో చెప్పాడు.
"వీటిని ధరిస్తే blood circulation ఎలా పెరుగుతుంది" ఆశ్చర్యంగా అన్నది కవిత.
"మీది కాదు మిస్. మీరు చదివే కాలేజీలోని కుర్రాళ్ళది" చెప్పాడు షాపతను.
కూర
"ఈ రోజు మీ ఇంట్లో బెండకాయ కూర చేశారు కదూ వదినా?"
"అరె! అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగారు?"
"రాత్రి మా దొడ్లో బెండకాయలు ఎవరో దంగవెధవలు కోసుకెళ్ళార్లే"
English Medium
"బాబూ ఏది నీ నోరు చూపించు, అ, ఆ.. అను" అన్నాడు డాక్టర్ రాముతో.
పక్కనే ఉన్న రాము తండ్రి "మా వాడు english medium అండీ అ, ఆలు రావు" అన్నాడు డాక్టర్తో
పుస్తకం
"అదేంట్రా... రెండూ ఒకే రకం పుస్తకాలెందుకు కొన్నావు?" గిరిని అడిగాడు శ్రీపతి.
"ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్లే అని రాసుంది. అందుకే రెండు కొన్నాను" చెప్పాడు గిరి.
కరెంట్
"కరెంటు పోయినా, క్యాండిల్ కూడా లేకుండా అంతా చీకట్లో అన్నయ్యగారు వంట ఎలా చేస్తున్నారు కాంతమ్మొదినా?" ఆశ్చర్యంగా అడిగింది పొరుగింటి అంజమ్మ.
"ఆయన photographer కదా.
Dark roomలో పనిచెయ్యడం ఆయనకి అలవాటే" తేలికగా చెప్పింది కాంతమ్మ.
బలి
"ఏవండోయ్... ఈ రోజు మన పళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది సుగుణ.
"ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్.
సాంప్రదాయం
అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి.
"చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను" చివరి జాగ్రత్తగా చెప్పింది.
"ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ" అన్నది ఆధునికతరం యువతి.
నెహ్రూ గారి మాటలు
రాష్ట్రపతి ఓ కాలేజీని సందర్శించి అక్కడి విద్యార్ధులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళేమి కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటున్నారు.
"నేను డాక్టర్నిీ అయ్యి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తా" అన్నడు రమణ.
"నేను ఇంజినీరునై దేశాన్ని అభివృద్ది పధంలోకి తీసుకెళ్తా" చెప్పాడు గోవింద్
"నేను మంచి తల్లినవుతా. చదువుకున్న బాధ్యతాయుతమైన తల్లి వల్లనే పిల్లలు మంచి పౌరులుగ రూపొంది దేశం బాగుపడుతుందన్నారు నెహ్రూ గారు " అంది దీప.
"మరి నువ్వో?" మౌనంగా ఉన్న హరిని అడిగారు రాష్ట్రపతి
"నెహ్రూగారి మాటలను నిజం చేసేందుకు నా వంతు సహకారం అందిస్తా" దీపకేసి ఓరగా చూస్తూ చెప్పాడు హరి.
బాక్సింగ్
ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి.
"ఊ కొట్టు... కొట్టు.... దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి" అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి.
"మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?" అడిగాడు పక్కనున్న వ్యక్తి.
"కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్‌ని" చెప్పాడు దంతనాధం
చెక్కు
"రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్.
"ఎందుకండీ?" అన్నాడు చంద్రం.
"ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట" అన్నాడు డాక్టర్.
"మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది" బదులిచ్చాడు చంద్రం.
నిద్ర పోయేముందు
డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి "ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి" అని అడిగాడు వాసు.
"రెండెందుకండీ?" అమాయకంగా అడిగాడు షాపువాడు.
"ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు. ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి.."
Death Certificate
"మా నాన్నగారి death certificate submit చేస్తే కానీ మా అమ్మకు pension ఇవ్వరట. అదేదో ఇచ్చి పుణ్యం కట్టుకోండి డాక్టర్ గారు.
"ఓ.. అలాగా... దానికేం భాగ్యం.... ఇంతకీ మీ నాన్న గార్ని treat చేసిన డాక్టరెవరు?
"ఆయన అదృష్టవంతులండి.. ఏ డాక్టర్ treat చెయ్యలేదండీ... ఆయనంతట ఆయనే పోయారు...."
చిరుత ... ఆ తరువాత
ఈ మధ్య నాకు వచ్చిన forward mail:
చిరంజీవి కొడుకు సినిమా - చిరుత : చిరు తనయ, అయితే, మరి మిగతా హీరోల
కొడుకుల సినిమలు ఏమి అవ్వచ్చు?
బుడత - బాలకృష్ణ తనయ
ఉడత - వెంకటేష్ తనయ
మిడత - మోహన్ బాబు తనయ
పిచుక - పవన్ కళ్యాణ్ తనయ
........
|
|
|
|