A PHP Error was encountered

Severity: Notice

Message: Only variable references should be returned by reference

Filename: core/Common.php

Line Number: 257

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/telugut1/public_html/system/core/Exceptions.php:185)

Filename: libraries/Session.php

Line Number: 675

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/telugut1/public_html/system/core/Exceptions.php:185)

Filename: libraries/Session.php

Line Number: 675

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/telugut1/public_html/system/core/Exceptions.php:185)

Filename: libraries/Session.php

Line Number: 675

Telugu Talks.Com
తీయ్యగా మాట్లాడడు!!!
ముత్యాలరావు:(కొడుకు చింటుతో): ఎందుకురా అందరితో కోపంగా మాటలాడతావు, కాస్త తీయ్యగా మాటలాడవచ్చు కదా అన్నాడు. ఇంతలో ఒకతను చింటుతో బాబు నీ పేరు ఏమిటి? అని అడిగాడు. వెంటనే చింటు"లడ్డు" అని చెప్పాడు. మరి మీ నాన్నా గారి పేరు ఏమిటి? "జిలేబి" అని చెప్పాడు .అదేమిటిరా అలా చెప్పావు. మీరే కదా తియ్యగా మాటలాడాలని అన్నారు.
గొంతు నొప్పి!!!
చిన్నమ్మి: పెళ్ళైన మూడు రోజులకే మీవారు ఎలా పోయారు చిన్నమ్మి? పెద్దమ్మి : మొదటి రోజు కాళ్ళు నొప్పంటే పట్టాను, రెండో రోజు నడుమునొప్పి అంటే పట్టాను, మూడో రోజు గొంతు నొప్పి అంటే పట్టాను, అంతే ..........?
కాచ్ మన్!!!
అప్పారావు(సుబ్బారావుతో): నువ్వు వాచ్ మన్ గా పనిచేస్తున్నావు కదా, దొంగలు పడితే ఎందుకు పట్టుకోలేదు. సుబ్బారావు : నేను వాచ్ మన్ ని కాని కాచ్ మన్ ని కాదు..........!!
మందుకు విషానికి తేడా ఏమిటి??
అప్పారావు: సుబ్బారావు తో మందుకు విషానికి తేడా ఏమిట్రా? సుబ్బారావు : మందు తాగితే నలుగురిలో మనం చిందులేస్తాం, విషం తాగితే మన చుట్టూ నలుగురు డప్పు వాయిస్తూ చిందులేస్తారు.
రైలును ఎవరు కనుక్కొన్నారు??
టీచర్(రాముతో):రాము విమానాన్ని ఎవరు కనుక్కొన్నారు? రాము: రైట్ బ్రదర్స్ టీచర్. టీచర్(సోముతో): సోము రైలును ఎవరు కనుక్కొన్నారు? సోము: లెఫ్ట్ బ్రదర్స్ టీచర్.
ATM దొంగ!!
పప్పు:"ATM నుండి డబ్బులు తీసుకుంటున్నాడు". ఇంతలో బిల్లు(దొంగ):" పప్పు వెనకలనుండి హ, హ నీ పాస్ వర్డ్ నేను చూశాను.అది 1458" పప్పు:" హ, హ, హ కాదు, కాదు, అది 1258"........
పరీక్షా !!!
"ఏరా పరీక్షా ఎలా రాశావు?" అడిగాడు కామేశం కొడుకు బాబిని. బాబి: "కేక వందకు వంద వస్తాయి" తల ఎగిరేస్తూ చెప్పాడు బాబి. కామేశం:"నేను నమ్మను" అనుమానంగా చూసాడు బాబిని. బాబి:"నువ్వు నమ్మవనే ఆన్సర్ షీట్ కూడా తీసుకొచ్చా. ఇదిగో చూడు" బ్యాగ్ లో నుండి తీస్తూ అన్నాడు బాబి.
(చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు)
ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది. వరహాల రావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి "ఏమండీ మీ బందువొస్తోంది...పలకరించండి" అంది నవ్వుతూ. వరహాల రావు: "నమస్తే అత్త గారు..............బాగున్నారా?" నేను మీ అమ్మాయి "Evening Walk" కి బయలుదేరామండి" అని పలకరించాడు వరహాల రావు. ఆఆఆఆఅ...............
200 ఏళ్ళ 10 రోజుల కిందటి పెయింటింగ్!!!
చింటూ: "ఈ పెయింటింగ్ 200 ఏళ్ళ 10 రోజుల కిందటిది కదా?" బంటి: "అంత సరిగ్గా ఎలా చెప్పగలవు?" చింటూ: "10 రోజుల క్రితం దీన్నికొన్నప్పుడు షాపువాడు 200 ఏళ్లది అని నాకు చెప్పాడు." ఆఆఆఆఆఆఆఆ..............
నాన్నకు షుగర్!!!
చిన్నా: మీ నాన్నంటే మీ అమ్మకు యెంత గౌరవం! మీ నాన్నా తాగందే కాఫీ కూడా తాగట్లేదు. మున్నా: అది కాదురా! మా నాన్నకు షుగర్. ఆయనకిచ్చాక పంచదార వేసుకొని మా అమ్మ తాగుతుంది. ఆఆఆఆఆఆఆఆఅ..............
కుక్కపిల్ల పళ్ళెం!!
సరిత: (మమతతో) "అదేమిటి వదిన మీరు పెట్టిన స్వీట్స్ తింటూవుంటే మీ కుక్కపిల్ల నేను పట్టుకున్న పళ్ళెం వైపు అదేపనిగా చూస్తున్నది." మమత:(సరితతో) "చూడదు మరి, నువ్వు పట్టుకొని తింటున్న పళ్ళెం దానిదేగా మరి"! ఆఆఆఆఆఆఆఆ......
లైఫ్ బాయ్ సబ్బుతో ఆరోగ్యాo!!!
సుబ్బులు: "లైఫ్ బాయ్ సబ్బు పెట్టాను", ఎక్కడండి? ముత్యాల రావు: ఆరోగ్యానికి మంచిదని T.V లో చెబితే తినేశా! ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ..........
పరీక్షలలో "౦" (సున్నా) మార్కులు!!!!
చింటూ:(బంటిని): ఇలా అడుగుతున్నాడు. బంటి నీకు అన్ని పరీక్షలలో "౦" (సున్నా) మార్కులు వస్తున్నాయి కదా, మీ నాన్నా కొట్టటం లేదా? బంటి:ఎందుకు లేదు, మా నాన్నా కొట్టేడానికి చేయి ఎత్తినప్పుడల్లా "జనగణ మన" అని పాడుతున్నాను. దానితో మా నాన్నా నిలబడిపోతున్నాడు. నేను అక్కడినుండి పరుగెత్తిపోతున్నాను, అని చెప్పాడు బంటి చింటుతో.
సున్నా మార్కులు!!!
చింటు:(బంటూతో): ఏరా!నీకు అన్నీ సబ్జెక్టులలో సున్నా మార్కులే వస్తాయి ఎందుకు? మీ నాన్నా ఏమి చేస్తుంటాడు? బంటు:మా నాన్నా కోడి గ్రుడ్ల వ్యాపారం చేస్తుంటాడు!ఆఆఆ.................
అప్పారావు--మణి!!
అప్పారావు (భార్యతో అంటున్నాడు): దేవుడు నీకు రెండు కళ్ళు ఇచ్చాడుగా అన్నంలో రాళ్ళు లేకుండా ఏరలేవా? మణి (భర్తతో): దేవుడు మీకు కూడా 32 పళ్ళు ఇచ్చాడుగా . ఆ మాత్రం నమలలేరా.........!
(జడ్జి దొంగతో)
జడ్జి : నువ్వు దొంగతనం చేసినప్పుడు CC కెమెరాలో రికార్డయింది తెలుసా ? దొంగ : అయితే చూపించండి . జడ్జి : చూశావుగా మరి నీవేమైనా చెప్పాలనుకుంటున్నావా? దొంగ : చూశారుగా నా పర్ఫామేన్స్ . నచ్చితే DTA Donga అని టైప్ చేసి 65656 కి S M S చేయండి. Please Vote for me(దయచేసి నాకు ఓటు వేయండి)
just for fun....
మన హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు. వచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు. పరిక్ష మొదలైన 10 నిమిషాల తరువాత వచ్చాడు మహేష్ బాబు.. ఏంటి బాబు లేట్ అంటే .. *మహేష్:*: ఎప్పుడు వచ్చామని కాదు అన్నయ్య పరీక్ష రాశామా లేదా ..? అని వెళ్ళి కూర్చున్నాడు. (వెనకున్న చిరంజీవి బ్రదర్ ఇది తీసుకో అని స్లిప్ ఇచ్చాడు మహేష్ థాంక్స్ చెబితే) *చీరంజీవి:*: థాంక్స్ కాదు బ్రదర్ ఆ స్లిప్ ను మూడు చేసి ముగ్గురికి ఇవ్వు, ఆ ముగ్గురుని ఇంకో ముగ్గురకు ఇవ్వమని చెప్పు అలా మొత్తం స్లిప్ లు మయం చేయండి. (అనగానే పక్కనే వున్న రామ్ చరణ్ అందుకుని) *రామ్ చరణ్: ఒక్కొకటి కాదు నాన్న, వంద స్లిప్పులు ఒక్కసారి పంపించు 300 వందలమందికి పంచుతా.. (అని కూర్చున్నాడు. అప్పుడు సాయికుమార్ వచ్చి) *సాయికుమార్: *కనిపించే మూడు పేపర్లు .. OMR పేపర్, క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్ అయితే కనిపించని ఆ నాలుగో పేపరేరా స్లిప్...స్లిప్...స్లిప్. (అని తన స్లిప్ తను తీసుకుని కూర్చున్నాడు.) స్లిప్ప్పులు ఎక్కువై కోపం వచ్చిన బాలకృష్ణ *బాలకృష్ణ:*: ఒరేయ్ .. నేను కాపీ కొట్టడం మొదలుపెడితే.... ఏ ప్రశ్నకి ఏ జవాబు రాసానో కనుక్కోవడానికి వారం పట్టిద్ది. మర్యాదగా ఏ ప్రశ్నకు ఏ స్లిప్పో సరిగ్గా చెప్పండి. (మరోపక్క స్లిప్పులు దొరక్క ఎగబడుతున్న వాళ్ళను పక్కకు నెట్టిన ప్రభాస్) *ప్రభాస్: *వాడు పొతే వీడు, వీడు పొతే నేను, నేను పొతే నా అమ్మామొగుడు అని ఎవరైనా స్లిప్ కోసం ఎగబడితే ... దెబ్బకో తలకాయ్ చొప్పున బెంచిలకి బలవుతాయి... అని స్లిప్పు తెచ్చుకు రాసుకుంటున్నాడు. (యన్.టి.ఆర్ బుద్దిగా తన స్లిప్పు తను రాసుకుంటుంటే ఎవడో వచ్చి స్లిప్పు లాక్కోబోతే వాడి చెయ్యి గట్టిగా పట్టుకుని) *జూ!! యన్.టి.ఆర్ : *రేయ్... సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటూన్నవేమో ... లోపల ఒరిజినల్ అలాగే ఉంది. స్లిప్పు వదల్లేదో ..... రచ్చ..రచ్చే..! (అన్నాడు. ఈ లోపు ఎగ్జామ్ స్క్వాడ్ వచ్చి పేపర్లు లాక్కుని అందరినీ బయటకు పంపారు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా...అని అందరు ఆలోచిస్తుంటే, అందరికన్నా చివరన వచ్చాడు రవితేజ ) *రవితేజ: *ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా.. అనేగా మీ డవుటు.... నేనే...ఇచ్చా...! ఊరికినే కాపీ కొడితే.... కిక్ ఏముంది నా అప్పడం. అందుకే స్క్వాడ్ ను పిలిచా..! అని అక్కడి నుండి పరిగెత్తాడు. పట్టుకోవడానికి రవితేజ వెనకాల పడ్డారు మిగిలిన అందరు..
ఈజిప్ట్
కొడుకు నాన్నతో "నాన్న నువ్వు ఈజిప్ట్ ఎప్పుడు వెళ్లావు?" "నేను ఈజిప్ట్ ఎప్పుడూ వెళ్ళలేదు. అయినా నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నాన్న. "మరి మమ్మీని ఎక్కడ నుంచి తీసుకొచ్చావు?"
చిరుత ... ఆ తరువాత
ఈ మధ్య నాకు వచ్చిన forward mail: చిరంజీవి కొడుకు సినిమా - చిరుత : చిరు తనయ, అయితే, మరి మిగతా హీరోల కొడుకుల సినిమలు ఏమి అవ్వచ్చు? బుడత - బాలకృష్ణ తనయ ఉడత - వెంకటేష్ తనయ మిడత - మోహన్ బాబు తనయ పిచుక - పవన్ కళ్యాణ్ తనయ ........
మూడు పెళ్లిళ్లెందుకంటే..
న్యాయమూర్తి: ఒకటి కాదు, రెండు కాదు.. మూడు పెళ్లిళ్లు చేసుకుంటావా.... నేరం అని తెలియదా... సుబ్బారావు: ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుందంటారు కదండీ.. ఒకటి, రెండు పెళ్లిళ్లతో విజయం లభించలేదు. అందుకే... మూడో పెళ్లి చేసుకున్నా...